చంద్రబాబు చాణక్యం పని చేస్తుందా ?

79
- Advertisement -
Will chandrababu efforts bring a change in ap politics 
Will chandrababu efforts bring a change in ap politics

రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబుకు గతకొంత కాలంగా వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన ఘనత సాధించాడు బాబు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా సేవలు అందించాడు. అయితే 2019 లో ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో చతికిల బడ్డాడు.

కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ నుండి పలువురు రాజ్యసభ సభ్యులు అలాగే ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. తాజాగా ఏపీ లో జరిగిన పరిస్థితులు చంద్రబాబుకు కాస్త కలిసి వచ్చాయి. జగన్ ప్రభుత్వం మీద కొన్ని వర్గాల ప్రజలు గుర్రుగా ఉన్నారు.

అలాగే వరుసగా తెలుగుదేశం నాయకులను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేయడమే కాకుండా వాళ్ళని జైల్లో పెడుతుండటంతో పాటుగా అక్రమ కేసులు కూడా పెడుతున్నారు దాంతో జగన్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయడానికి హస్తినాపురం వెళ్ళాడు బాబు.

ఒకప్పుడు చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పిన నేత. మహామహులు అయిన వాజ్ పేయి , అద్వానీ లతో పాటుగా ఇతర జాతీయ నాయకులను కూడా తన చాణక్యంతో ఆకట్టుకున్న వ్యక్తి , శక్తి . కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. మోడీ- షా జోడీతో బాబుకు పొసగడం లేదు కానీ పాత పరిచయాలతో ఏపీలో జరుగుతున్న దాడులను చెప్పి జగన్ భవితవ్యాన్ని మార్చే నేర్పు బాబు చేయగలడా ? ఆ అపర చాణక్యం ఇప్పుడు పనిచేస్తుందా ? అన్న అనుమానం అయితే నెలకొంది. మోడీ – షా కనుక బాబుకు ప్రాధాన్యం ఇస్తే తప్పకుండా జగన్ సర్కారుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

More Web Stories:

10 alluring pics of Nehaa Solanki
10 alluring pics of Nehaa Solanki
Top 10 Crime Shows to watch right away
Top 10 Crime Shows to watch right away
10 sultry pics of Tejaswi Madivada
10 sultry pics of Tejaswi Madivada
10 stunning pics of Sonakshi Sinha
10 stunning pics of Sonakshi Sinha
Subscribe us on JSWTV - Google News