ఆర్ ఆర్ ఆర్ రన్ టైం పై షాకింగ్ న్యూస్

185
- Advertisement -
Shocking run time for RR
Shocking run time for RR

ఎన్టీఆర్రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ”. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ చిత్రం 2022 జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక ఈ సినిమా రన్ టైం అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఆర్ ఆర్ ఆర్ రన్ టైం ఎంతో తెలుసా ……… మూడున్నర గంటలు అంట. మూడున్నర గంటలు అంటే చాలా సమయం. ఈరోజుల్లో మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా అంటే ప్రేక్షకులు అంత సమయం ఓపిక పట్టడం కొంచెం కష్టమే !

కానీ ఎన్టీఆర్ కొమరం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు కాబట్టి వాళ్ళని చూడటానికి అలాగే వాళ్ళిద్దరి మధ్య భీకరమైన పోరాట సన్నివేశాలను చూడటానికి తప్పకుండా మూడున్నర గంటల సమయం తప్పదని అంటున్నాడట దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. బ్రిటీష్ పాలకులతో అలాగే నైజాం నవాబులతో పోరాడే సన్నివేశాలు సినిమాకు హైలెట్ అని …… ఆ సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయని ……. ప్రేక్షకులు ఆస్వాదించడం ఖాయమని ధీమాగా ఉన్నాడట జక్కన్న.

సినిమాలు 70- 80 వ దశకంలో నాలుగు గంటలు ,మూడు గంటలు , మూడున్నర గంటల సినిమాలు వచ్చేవి. కానీ ఆ తర్వాత కాలం మారింది. మూడు నుండి రెండున్నర , రెండు గంటల సినిమాలు మాత్రమే వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మూడున్నర గంటల సినిమా అంటే కొంచెం ఆలోచించాల్సిందే. అయితే బెటర్ ఏంటంటే అక్కడ మూడున్నర గంటల పాటు కనిపించేది ఎన్టీఆర్ , చరణ్ , అజయ్ దేవ్ గన్ లాంటి హేమాహేమీలు. దేశ స్వాతంత్య్రం కోసం జీవితాల్ని ఫణంగా పెట్టి పోరాడిన వీరుల చరిత్ర కాబట్టి తప్పకుండా రన్ టైం గురించి బాధపడాల్సిన అవసరం లేదని అంటున్నాడట జక్కన్న.

More Web Stories:

10 alluring pics of Nehaa Solanki
10 alluring pics of Nehaa Solanki
Top 10 Crime Shows to watch right away
Top 10 Crime Shows to watch right away
10 sultry pics of Tejaswi Madivada
10 sultry pics of Tejaswi Madivada
10 stunning pics of Sonakshi Sinha
10 stunning pics of Sonakshi Sinha
Subscribe us on JSWTV - Google News